యాప్నగరం

లైఫ్ జాకెట్స్ లేకున్నా.. ఏం కాదన్నారట!

కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ప్రాణాలు అరచేత పట్టుకుని...

TNN 12 Nov 2017, 9:07 pm
కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరిన బాధితులు అనంతరం మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. భవానీ ఐలాండ్‌కు వెళ్లి వచ్చేందుకు రూ.300 వసూలు చేసిన ప్రైవేటు పర్యాటక సంస్థ నిర్వాహకులు తాము లైఫ్ జాకెట్స్ ఇవ్వమని అడిగితే మాత్రం అటువంటి వాటితో ఇక్కడ అవసరం లేదని బదులిచ్చారని బాధితులు వాపోయారు. నదిలో విహారానికి వెళ్లేటప్పుడు అత్యవసరంలో లైఫ్ జాకెట్స్ వుండాలి కదా అని అడిగినప్పటికీ.. ఈ బోటుకు లైఫ్ జాకెట్లతో అవసరం లేదనే సమాధానమే వారి నుంచి వచ్చిందని ప్రమాదం చోటుచేసుకోవడానికన్నా ముందుగా జరిగిన పరిణామాన్ని వివరించారు బాధితులు.
Samayam Telugu theres no life jackets in boat victims of boat capsized accident
లైఫ్ జాకెట్స్ లేకున్నా.. ఏం కాదన్నారట!


బోటు బోల్తా పడటానికన్నా ముందుగా కుదుపులకి గురైంది. దీంతో అందరం బోటుని గట్టిగా పట్టుకుని నిలబడేందుకు ప్రయత్నించాం, కానీ ఇంతలోనే బోటు తలకిందులైపోయిందని తమకి ప్రత్యక్షంగా ఎదురైన ఆ భయంకరమైన అనుభవాన్ని గుర్తుచేసుకుని వణికిపోయారు బాధితులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.