యాప్నగరం

ముగ్గురు ఐఐటీ బ్యాచ్‌మేట్స్‌ని బలిగొన్న ప్రమాదం

జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ దుర్మరణం పాలైన సంగతి మరిచిపోకముందే....

TNN 13 May 2017, 4:44 pm
జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ దుర్మరణం పాలైన సంగతి మరిచిపోకముందే శుక్రవారం ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఐఐటీ పూర్వ విద్యార్థులు మృతిచెందారు. ఖమ్మంలో స్నేహితుడి పెళ్లికి హాజరయ్యేందుకని హైదరాబాద్ నుంచి కారులో బయల్ధేరిన నలుగురు స్నేహితులలో తుక్కుగూడ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనలో ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
Samayam Telugu three iit alumni killed in car crash on hyderabad outer ring road
ముగ్గురు ఐఐటీ బ్యాచ్‌మేట్స్‌ని బలిగొన్న ప్రమాదం


జెమొసో టెక్నాలజీస్‌లో ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పీ సూర్యతేజ, ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రవితేజ, అమేజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా వున్న టీ రోహిత్, ప్రస్తుతం పోటీ పరీక్షలకి సన్నద్ధం అవుతున్న సీహెచ్ కిరణ్ కుమార్ స్నేహితులు. అందరూ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2011 బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థులే. నలుగురూ కలిసి ఖమ్మంలో జరగనున్న మరో బ్యాచ్‌మేట్ పెళ్లి కోసం సూర్యతేజకి చెందిన ఏపీ 16బీబీ 3888 నెంబర్ గల హ్యూండాయ్ వర్న కారులో గచ్చిబౌలి నుంచి బయల్దేరారు.

ఉదయం7:15 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ డీసీఎం వ్యాన్‌ని ఎడమవైపు నుంచి ఓవర్ టేక్ చేసే క్రమంలో వ్యాన్‌ని ఢీకొట్టాడు కారు నడుపుతున్న సూర్యతేజ. దీంతో వెంటనే అదుపుతప్పిన కారు రోడ్డు రెయిలింగ్‌ని అంతే వేగంగా వెళ్లి ఢీకొని పల్టీలు కొట్టిందని తెలిపారు పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ పీ లక్ష్మీకాంత్ రెడ్డి.

ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవ్ చేస్తున్న సూర్యతేజ మద్యం మత్తులో లేడు. అలాగే డీసీఎం వ్యాన్ డ్రైవర్ దయానంద్‌ని కూడా ఈ ఘటనకి బాధ్యుడిని చేయలేం అని అన్నారు ఇన్‌స్పెక్టర్. సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ.. వారు ప్రాణాలు దక్కించుకోలేకపోయారని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120 కి.మీ వేగంతో ప్రయాణించి వుండవచ్చు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మతదేహాలని వారి కుటుంబసభ్యులకి అప్పగించారు పోలీసులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.