యాప్నగరం

నంద్యాల కౌంటింగ్‌కు పటిష్ట భద్రత

నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటుచేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు.

TNN 26 Aug 2017, 7:39 pm
నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటుచేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుందని వెల్లడించారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం (ఆగస్టు 28న) ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంతో పాటు పలు సమస్యాత్మక ప్రదేశాల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు ఏపీఎస్పీ బెలాలియన్‌ను బందోబస్తుకు ఏర్పాటు చేశామని తెలిపారు.
Samayam Telugu tight security for nandyal by poll counting on monday
నంద్యాల కౌంటింగ్‌కు పటిష్ట భద్రత


శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కౌంటింగ్ బందోబస్తుకు ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 38 మంది ఎస్సైలు, 74 మంది ఎఎస్సై, హెడ్ కానిస్టేబుళ్ళు, 260 మంది కానిస్టేబుళ్ళు, 20 మంది మహిళా కానిస్టేబుళ్ళు, 44 సెక్షన్ల ఎఆర్ సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, ఒక కంపెనీ సీఆర్పీఎఫ్‌ దళం, 5 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు ఏర్పాటు చేసి అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు.

ఇదిలా ఉండగా, నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నంద్యాల ఉపఎన్నికలో 79.13 శాతం పోలింగ్ నమోదయింది. నియోజకవర్గంలో మొత్తం 2,18,858 ఓటర్లు ఉండగా 1,73,189 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 84,549 ఉండగా, మహిళలు 88,639 ఉన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు నంద్యా్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు (పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 250) జరుగుతుంది. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 19 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు వివరాలకు పోలింగ్ కేంద్రం ఎదుట LED స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9.30 గంటల కల్లా ఎవరు ఆధిక్యంలో ఉన్నారో తెలిసిపోతుంది. ఉదయం 10.30 కల్లా నంద్యాల విజేత ఫలితం వచ్చే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.