యాప్నగరం

ధర్నా చౌక్‌ను తరలించొద్దంటూ ఆందోళన

హైదరాబాద్-ఇందిరాపార్క్‌ వద్దనున్న ధర్నాచౌక్‌ను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించకూడదని

Samayam Telugu 12 May 2017, 2:42 pm
హైదరాబాద్-ఇందిరాపార్క్‌ వద్దనున్న ధర్నాచౌక్‌ను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించకూడదని తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. టీజేఏసీ నేతలతో పాటు టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు గన్‌పార్క్‌ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగం ఆర్టికల్‌ 19 ద్వారా లభించిన హక్కుకు భంగం కలిగించొద్దని ప్రభుత్వానికి సూచించారు.
Samayam Telugu tjac protests at gun park over moving dharna chow from indira park
ధర్నా చౌక్‌ను తరలించొద్దంటూ ఆందోళన


ధర్నా చౌక్ తరలింపు నిర్ణయాన్ని రద్దు చేయాలని తాము డీజీపీకి, కలెక్టర్లకు విజ్ఞప్తులు చేశామని.. ధర్నాచౌక్‌ మూసివేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే 15న ధర్నాచౌక్‌కు పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేయడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనుకోవడం అవివేకమరి కోదండ రామ్ దుయ్యబట్టారు.

20 ఏళ్లుగా ఇందిరాపార్క్‌ వద్దనున్న ధర్నాచౌక్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేయాలని చర్యలు చేపట్టడం సరికాదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, ప్రజల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం వ్యవహారించడం దారుణమని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.