యాప్నగరం

చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం నాటికి 66 ఏళ్లు పూర్తి చేసుకొని 67 వసంతంలోకి ప్రవేశించారు.

TNN 20 Apr 2016, 11:09 am
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం 66 ఏళ్లు పూర్తి చేసుకొని 67 వసంతంలోకి ప్రవేశించారు.ఈ సందర్భంగా ఆయన బెజవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా తన జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. సీఎం హోదాలో ఆయన 11వ సారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నపుడు ఆయన 9 సార్లు బర్త్ డే వేడుకలు జరుపుకోగా.. రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా ఉంటూ ఆయన రెండో సారి జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు.
Samayam Telugu today ap cm chandrababu 67th birthday
చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రముఖులు


సీఎం చంద్రబాబు 67 వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చంద్రబాబుకు దీర్ఘాయుషును ప్రసాదించాలని భగవంతుడికి కోరుతున్నట్లు తన సందేశంలో పేర్కొన్నారు . ఇదిలా ఉండగా తమ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.