యాప్నగరం

లేదు.. తెలీదు..: అబ్బా ఏం స్క్రిప్టు చార్మి!

విచారణకు ముందే హైకోర్టుకెళ్లి సిట్ అధికారులకు షాక్ ఇచ్చిన హీరోయిన్ చార్మి.. బుధవారం జరిగిన విచారణలో కూడా వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది.

TNN 27 Jul 2017, 9:36 am
విచారణకు ముందే హైకోర్టుకెళ్లి సిట్ అధికారులకు షాక్ ఇచ్చిన హీరోయిన్ చార్మి.. బుధవారం జరిగిన విచారణలో కూడా వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది. రకరకాల ప్రశ్నలు సందించిన సిట్ అధికారులు చార్మి నుంచి మాత్రం అనుకున్న సమాచారం రాబట్టలేకపోయారు. ప్రతిదానికీ లేదు, తెలీదు అంటూ చార్మి సమాధానాలిచ్చినట్లు తెలిసింది. అసలు నా వ్యక్తిగత విషయాలు మీకెందుకంటూ తనను ప్రశ్నించిన అధికారులనే చార్మి తిరిగి ప్రశ్నించినట్లు సమాచారం. కోర్టు ఆదేశాలు ఉండటంతో సిట్ అధికారులు కూడా కాస్త గట్టిగా చార్మిని అడగలేకపోయారట. బుధవారం ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన చార్మిని ఎక్సైజ్ ఏఎస్పీ పవన్ కుమార్, మహిళా ఇన్‌స్పెక్టర్లు బీఎల్ రేణుక, వి.విజయలక్ష్మి, ఎస్ఐ సీహెచ్ శ్రావణి బృందం సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించింది.
Samayam Telugu tollywood actress charmi quizzed in hyderabad drug scandal case
లేదు.. తెలీదు..: అబ్బా ఏం స్క్రిప్టు చార్మి!


అయితే వీరు అడిగిన ప్రశ్నలకు చార్మి నుంచి సరైన సమాధానాలు రాలేదు. డ్రగ్స్ అలవాటు ఉందా, గోవాకు ఎందుకు వెళ్లేవారు, బ్యాంకాక్ వెళ్తుంటారా? అని అధికారులు ప్రశ్నిస్తే.. తనకు ఏమీ తెలియదని సమాధానమిచ్చింది. కెల్విన్ ఫోన్‌లో ‘చార్మి దాదా’ అని మీ ఫోన్ నంబర్ సేవ్ అయి ఉంది కదా, ఆయనతో ఏమైనా సంబంధాలున్నాయా? అని అడిగితే ‘అతనెవరో నాకు తెలీదు, అసలు అతని ఫోన్‌లో నా నంబర్ ఎందుకు ఉంటుంది’ అని అన్నట్లు సమాచారం. చార్మి డ్రగ్స్ వాడినట్లు కొన్ని వీడియో క్లిప్పింగులు ఆమెకి అధికారులు చూపించారట. కానీ తనకు డ్రగ్స్ అలవాటు లేదని, ఈ వీడియోల గురించి తనకు తెలీదని సమాధానం ఇచ్చిందట.

పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడతారా?, ఆయన డ్రగ్స్ వాడేటప్పుడు మీరు చూశారా? అని కూడా ప్రశ్నించారట. వీటికి కూడా లేదు, తెలీదు అనే సమాధానాలే చార్మి నోటి నుంచి వచ్చినట్లు సమాచారం. ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఫంక్షన్‌లో మీరు కెల్విన్‌తో దిగిన సెల్ఫీ మా దగ్గర ఉందని అధికారులు చెప్పగా.. అలా తానెప్పుడూ దిగలేదని, అది తనది కాదని సమాధానమిచ్చిందట. ఇలా ప్రతి ప్రశ్నకు ఆమె సమాధానాలు దాటవేయడంతో అధికారులు తీవ్ర నిరాశకు గురయ్యారట. వాస్తవానికి మిగిలిన వాళ్లతో పోలిస్తే చార్మి విషయంలో కాస్త ఎక్కవగానే ప్రచారం జరిగింది. ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉందని, గట్టిగా ప్రశ్నిస్తే చాలా విషయాలు బయటికొస్తాయని సిట్ అధికారులు భావించారు. కానీ పక్కా స్క్రిప్టుతో వచ్చిన చార్మి.. దాన్ని ఏ మాత్రం దాటకుండా, ఎక్కడా భయపడకుండా సమాధానాలిచ్చి సిట్ అధికారులే ఝలక్ ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.