యాప్నగరం

బాబు పోరాటానికి టాలీవుడ్ పూర్తి మద్దతు

ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన టీడీపీ, కేంద్రంపై పోరాటం సాగిస్తోన్న విషయం తెలిసిందే.

Samayam Telugu 30 Mar 2018, 3:16 pm
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోన్న పోరాటానికి సినీ రంగం నుంచి కూడా మద్దతు లభించింది. పలువురు సినీ ప్రముఖులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమరావతిలో శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన టాలీవుడ్ దర్శక నిర్మాతలు.. విభజన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటానికి బాసటగా ఉంటామని ప్రకటించారు. ప్రత్యేకహోదా సాధన కోసం తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కేంద్రం వైఖరికి నిరసనగా అఖిల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తాము కూడా నల్ల బ్యాడ్జీలతో ఏప్రిల్ 6 వరకు నిరసన తెలుపుతామని అన్నారు. సీఎంను కలిసిన వారిలో కె. రాఘవేంద్ర రావు, అశ్వనీదత్‌, కేఎల్‌ నారాయణ, కేఎస్‌ రామారావు, జెమిని కిరణ్‌, కె. వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Samayam Telugu చంద్రబాబుతో సినీ ప్రముఖల భేటీ


ఏపీకి ప్రత్యేక హోదాపై హీరో మోహన్‌బాబు, శివాజీ, నిఖిల్ సిద్దార్థ, మంచు మనోజ్, సంపూర్ణేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, కొరటాల శివ, మా అసోసియేషన్ సైతం ఇప్పటికే తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల కిందట టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ సమస్యకు దూరంగా ఉంటోందని వ్యాఖ్యానించడం, దీనికి టాలీవుడ్ కూడా ఘాటుగా స్పందించడం తెలిసిందే. శివాజీరాజా, తమ్మారెడ్డి భరద్వాజ్, పోసాని లాంటి వాళ్లు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ రిప్లయ్ కూడా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.