యాప్నగరం

సెలవులో సబర్వాల్.. డ్రగ్స్ కేసులో ఒత్తిళ్లు?

డ్రగ్స్ మాఫియా ఆట కట్టిస్తోన్న ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ పది రోజులపాటు సెలవులో.. కారణాలేంటి?

TNN 14 Jul 2017, 1:52 pm
కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలతో మొదలుపెట్టి.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా పునాదులు పెకిలిస్తున్న ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ పది రోజల పాటు సెలవుపై వెళ్తున్నారు. మాదకద్రవ్యాల కేసు సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సెలవుపై వెళ్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్స్ మాఫియా ఆటకట్టిస్తోన్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఇంతటి కీలక సమయంలో సెలవుపై వెళ్లడానికి ఆయనపై పెరుగుతున్న ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. ఈనెల 16 నుంచి 27 వ‌ర‌కు సెలవు తీసుకుంటున్న ఆయన హైదరాబాద్‌లో ఉండబోవటం లేదు. ఈ పది రోజులపాటు సెలవులో ఎక్కడికి వెళ్తున్నారనే విషయమై స్పందించే సమయంలో ఆయన తడబడటం కూడా అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
Samayam Telugu tollywood drug mafia ips akun sabarawal on leave for ten days
సెలవులో సబర్వాల్.. డ్రగ్స్ కేసులో ఒత్తిళ్లు?



మాదక ద్రవ్యాల విషయమై నాలుగు కేసులు నమోదు చేశామని, ఇప్పటి వరకూ 13 మందిని అరెస్ట్ చేశామని అకున్ సబర్వాల్ తెలిపారు. ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చామని, విచారణకు హాజరు కావాలని చెప్పామన్నారు. మేం ఎవరి పేర్లను బయటపెట్టలేదని, కేసు విచారణలో ఉండగా.. పేర్లను బయటపెట్టడం నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, వ్యక్తిగత కారణాలతోనే సెలవులో వెళ్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తనకు పూర్తిగా సహకరిస్తోందని ఆయన చెప్పారు. కానీ ఈ కేసును నీరు గార్చేందుకే అకుల్‌ను సెలవుపై పంపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.