యాప్నగరం

నన్నడిగితే బ్లడ్ శాంపిల్ స్వచ్చందంగా ఇస్తా: పోసాని

డ్రగ్స్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సిట్ అధికారులకు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి బాసటగా నిలిచారు.

TNN 25 Jul 2017, 3:22 pm
డ్రగ్స్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సిట్ అధికారులకు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి బాసటగా నిలిచారు. మత్తు పదార్థాల కేసులో కేవలం సినీ రంగాన్ని లక్ష్యం చేసుకుంటున్నారంటూ నటుడు నారాయణమూర్తి, దర్శకుడు రాంగోపాల్ వర్మ లాంటి వారు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పోసాని స్పందించారు. సిట్ అధికారులు సినీ రంగాన్నే టార్గెట్ చేశారనడం సరికాదని పోసాని అన్నారు. ఈ కేసులో సినీ రంగానికి చెందిన వారితోపాటు ఇతరులనూ కూడా పోలీసులు విచారిస్తున్నారని పేర్కొన్నారు. విచారణకు హాజరైన వారు రక్తనమూనాలను ఎందుకు ఇవ్వడం లేదో తనకు తెలియదన్న పోసాని, అది వారి వ్యక్తిగత విషయమని చెప్పారు. తనను అడిగితే మాత్రం స్వచ్చందంగా రక్త నమూనాలను ఇస్తానని ప్రకటించారు. టాలీవుడ్‌లో పోసానిది విలక్షణమైన శైలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ముక్కుసూటిగా వ్యవహరించే పోసాని ఎంతటి వారైనా సరే విమర్శించడానికి ఆయన వెనుకాడరు.
Samayam Telugu tollywood drug scandal actor posani krishnamurali supports to sit
నన్నడిగితే బ్లడ్ శాంపిల్ స్వచ్చందంగా ఇస్తా: పోసాని


డ్ర‌గ్స్ వ్య‌వహారంలో టాలీవుడ్ నటులను సిట్ విచారిస్తున్న తీరు సరిగాలేదంటూ ఎక్సైజ్ శాఖ‌పై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కామెంట్లు చేయడం, అయితే అవి ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన‌వి కావంటూ తెలంగాణ ప్రొహిబిష‌న్ అండ్‌ ఎక్సైజ్ డైరెక్ట‌ర్ అకున్ స‌బర్వాల్‌తోపాటు ఆ శాఖ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. డ్రగ్స్ కేసులో సినిమా వాళ్లనే తప్పుగా చూపుతూ మీడియా హైడ్రామా ఆడుతోందని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం సరికాదని ఆయన విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.