యాప్నగరం

సిట్ కార్యాలయానికి చేరుకున్న రవితేజ

డ్రగ్స్ కేసులో తొమ్మిదో రోజు విచారణకు హీరో రవితేజ హాజరయ్యారు. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో రవితేజ నాంపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.

TNN 28 Jul 2017, 10:25 am
డ్రగ్స్ కేసులో తొమ్మిదో రోజు విచారణకు హీరో రవితేజ హాజరయ్యారు. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో రవితేజ నాంపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణకు రవితేజ ఒక్కరే వచ్చారు. ఆయన వెంట బౌన్సర్లు కానీ, ఎలాంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ రాలేదు. ఒక సహాయకుడు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. ఇప్పటి వరకు విచారణకు హాజరైన తెలుగు సినీ ప్రముఖుల్లో రవితేజ బిగ్ సెలబ్రిటీ కావడంతో కాస్త ఆసక్తి పెరిగింది. సిట్ అధికారులు సందించే ప్రశ్నలకు రవితేజ ఎలాంటి సమాధానాలు చెబుతారు.. పూరీతో సంబంధాలపై, డ్రగ్స్ అలవాటుపై రవితేజ ఎలా స్పందిస్తారు అనేవి ఇప్పుడు కీలకం.
Samayam Telugu tollywood hero ravi teja appears before sit
సిట్ కార్యాలయానికి చేరుకున్న రవితేజ


రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజు కూడా డ్రగ్స్ కేసు విచారణలో కీలకంగా మారనున్నాడు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న జీషన్ అలీ.. రవితేజకు తానే డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఇప్పటికే సిట్ అధికారుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ కారు డ్రైవర్ శ్రీనివాసరాజు ద్వారా ఆయనకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెల్లడించాడు. ఈ కోణంలోనే రవితేజను సిట్ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు విచారణలో పెద్దగా పాలుపంచుకోని అకున్ సబర్వాల్ సైతం.. రవితేజ విచారణలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. పూరీతో పాటు సుబ్బరాజు, తరుణ్‌లను 10 గంటలకు పైగా అధికారులు విచారించారు. మరి ఇప్పుడు రవితేజను కూడా సుమారు అంతే సమయంపాటు విచారించనున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.