యాప్నగరం

ఓటమిపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైన ఉత్తమ్

ఎన్నికల ఫలితాలతో అధైర్య పడవద్దని కార్యకర్తలకు ఉత్తమ్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కార్యకర్తలతో చర్చించారు.

Samayam Telugu 15 Dec 2018, 10:17 pm
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరుత్సాహంలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. భారీ విజయంపై ధీమా ఉన్న ఆ పార్టీకి వారు అంచనా వేసిన దాంట్లో సగానికి సగం సీట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసిందని, కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లు తొలగించిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
Samayam Telugu Uttam


హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం (డిసెంబర్ 15న) ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ఎన్నికల ఫలితాలతో అధైర్య పడవద్దని కార్యకర్తలకు ఉత్తమ్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కార్యకర్తలతో చర్చించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలన్నాక గెలుపోటములు ఎవరికైనా సహజమంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉంటానన్నారు ఉత్తమ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.