యాప్నగరం

రేవంత్ రెడ్డి చేరికపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలపై...

TNN 22 Oct 2017, 8:56 pm
తెలంగాణలో టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి తమ పార్టీలో చేరనున్నట్టు తమకి ఎటువంటి సమాచారం లేదని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. అయితే, తమ పార్టీలోకి రావాలని భావించే వారికి తాము ఎప్పుడూ స్వాగతం పలుకుతామని ఆయన తేల్చిచెప్పారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Samayam Telugu tpcc chief uttamkumar reddy comments about revanth reddys issue
రేవంత్ రెడ్డి చేరికపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి


ఇదిలావుంటే, తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తల్ని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం కొట్టిపారేశారు. అదంతా కేవలం మీడియా కథనాలు మాత్రమే అని అన్నారాయన. అంతేకాకుండా త్వరలోనే జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 26న జరగనున్న టీడీఎల్పీ సమావేశంలో టీటీడీపీ నేతలు అందరం కలిసి చర్చించనున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.