యాప్నగరం

హైదరాబాద్ రోడ్లపై యముడు, చిత్రగుప్తుడు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిబంధనలు పాటించనివారికి యముడు, చిత్రగుప్తుడితో వార్నింగ్ ఇప్పిస్తున్నారు.

Samayam Telugu 11 Apr 2018, 2:20 pm
Samayam Telugu TRAFFIC
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిబంధనలు పాటించనివారికి యముడు, చిత్రగుప్తుడితో వార్నింగ్ ఇప్పిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోతే కలిగే నష్టాలు, ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేస్తే యమలోకానికి వెళతారంటూ హెచ్చరిస్తూ... అందరిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ మియాపూర్ ఆధ్వర్యంలో బకుల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ స్పెషల్‌ ట్రాఫిక్‌ సెఫ్టీ పేరుతో... మియాపూర్‌తో పాటూ మరికొన్ని ప్రాంతాల్లోని సిగ్నల్స్ దగ్గర అవగాహాన కల్పించారు. రోడ్లపైకి ఉన్నట్టుండి ఇలా యమడు, చిత్రగుప్తులు యమ భటులతో ప్రత్యక్షమయ్యారు. ఈ వేషాలు చూసి ముందు షాకైన వాహనదారులు... తర్వాత అసలు విషయం తెలుసుకొని నవ్వుకున్నారు.


ట్రాఫిక్ రూల్స్‌పై వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ఇలా వినూత్న ప్రయోగం చేశామంటున్నారు రోటరీ క్లబ్ సభ్యులు. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఎక్కువమంది ప్రాణాలు పోతున్నాయని... అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఇలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇలా కళాకారులతో ప్రదర్శన నిర్వహిస్తే... కొంతమందిలోనైనా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.