యాప్నగరం

విషాదం నింపిన మహా బతుకమ్మ.. వివాహిత మృతి

ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన మహా బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకలకు హాజరైన ఓ వివాహిత ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలైంది. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండల కేంద్రానికి చెందిన కందుల సృజన (22) మంగళవారం (సెప్టెంబర్ 26) సాయంత్రం హైదరాబాద్‌‌లో..

TNN 26 Sep 2017, 10:34 pm
ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన మహా బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకలకు హాజరైన ఓ వివాహిత ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలైంది. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండల కేంద్రానికి చెందిన కందుల సృజన (22) మంగళవారం (సెప్టెంబర్ 26) సాయంత్రం హైదరాబాద్‌‌లో నిర్వహించిన మహా బతుకమ్మ వేడుకకు హాజరైంది. కార్యక్రమం ముగిసిన తర్వాత తన తోటి మహిళలతో పాటు ఆమె వచ్చిన బస్సులోనే తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది.
Samayam Telugu tragedy in maha bathukamma woman dies accidentally
విషాదం నింపిన మహా బతుకమ్మ.. వివాహిత మృతి


బస్సు ఎక్కి కూర్చున్న సృజన అది ఆగి ఉండటాన్ని గమనించి.. కిటికీలోంచి తల బయటకు పెట్టి ముఖం కడుక్కోవడం ప్రారంభించింది. అది గమనించకుండా డ్రైవర్‌ బస్సును ఒక్కసారిగా వెనక్కి పోనిచ్చాడు. దీంతో పబ్లిక్‌ గార్డెన్‌ మెయిన్‌ గేట్‌ సృజన తలకు బలంగా తాకింది. ఈ హఠాత్పరిణామంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.