ఎంతో భవిష్యత్తున్న ఓ ట్రైనీ ఎస్ఐ జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. హర్యానాకు చెందిన సచిన్ (25) సీఐఎస్ఎఫ్ ఎస్ ఐ పోస్టుకు సెలెక్ట్ అయ్యాడు. శిక్షణ నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. షామీర్ పేటలో ని సీఐఎస్ఎఫ్ కేంద్రంలో గత అక్టోబర్ నెల నుంచి శిక్షణ తీసుకుంటున్నాడు. కాగా గురువారం అతను తను ఉంటున్న రూమ్ నెంబర్ 31లో ఫ్యాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సచిన్ తో పాతూ శిక్షణ తీసుకుంటున్న ఇతర ఎస్ఐలు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సచిన్ వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అతని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సచిన్ కుటుంబ సభ్యులకు విషయాన్ని ఫోన్ చేసి చెప్పారు.
ట్రైనింగ్లో ఉన్న ఎస్ఐ ఆత్మహత్య
ఎంతో భవిష్యత్తున్న ఓ ట్రైనీ ఎస్ఐ జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు.
TNN 19 Jan 2017, 3:47 pm