యాప్నగరం

నేరెళ్ల ఘటన: ఎస్సై‌ రవీందర్‌పై వేటు

తీవ్ర సంచలనం సృష్టించిన నేరెళ్ల ఇసుక లారీల దగ్ధం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

TNN 11 Aug 2017, 9:53 am
తీవ్ర సంచలనం సృష్టించిన నేరెళ్ల ఇసుక లారీల దగ్ధం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తొలిసారిగా ఓ ఎస్సై‌పై వేటు వేసింది. అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజలపై లాఠీచార్జీకి దిగిన క్రైం కంట్రోల్ స్క్వాడ్ (సీసీఎస్) ఎస్సై రవీందర్‌ను‌ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయన దురుసుగా వ్యవహరించి, లాఠీచార్జీ చేయడంవల్లే పరిస్థితి అదుపుతప్పినట్లు శాఖాపరంగా డీఐజీ రవివర్మ చేసిన విచారణలో తేలింది. విచారణ నివేదికను పరిశీలించిన డీజీపీ అనురాగ్‌శర్మ.. ఎస్సైని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఎస్సైకు సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరికొంతమంది పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Samayam Telugu trs government suspends ccs si ravinder in nerella issue
నేరెళ్ల ఘటన: ఎస్సై‌ రవీందర్‌పై వేటు


కాగా, కొద్దిరోజుల క్రితం మిడ్‌మానేరు నుంచి ఇసుకను రవాణా చేస్తున్న లారీకిందపడి ప్రమాదవశాత్తూ భూమయ్య అనే వ్యక్తి మరణించాడు. దీనితో కోపోద్రిక్తులైన నేరెళ్ల గ్రామస్థులు ఇసుక లారీలను దగ్ధం చేశారు. పోలీసులు లాఠీచార్జీకి దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీల దహనం కేసులో పోలీసులు పలువురిపై కేసులు పెట్టి జైలుకు తరలించారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్టేషన్‌కు తీసుకెళ్లిన తరవాత కూడా బాధితులను చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మంగళవారం (ఆగస్టు 7న) వేములవాడ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్‌కు కూడా వారు ఇదే విషయాన్ని వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. నేరెళ్ల ఘటన దురదృష్టకరమని, తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఘనటపై పూర్తి విచారణ జరిపిన డీఐజీ రవివర్మ నివేదికను ప్రభుత్వానికి అందించారు.

హామీ నిలబెట్టుకున్నా.. ట్విట్టర్‌లో కేటీఆర్
నేరెళ్ల బాధితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డీఐజీ నివేదిక ప్రకారం అధిక బలగాన్ని ఉపయోగించిన ఎస్సైను సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
As promised, the Inspector who was found to have used excessive force according to the DIG's report has been suspended https://t.co/ExvZxiwaev — KTR (@KTRTRS) August 10, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.