యాప్నగరం

టీజీ వెంకటేష్ వర్సెస్ టీఆర్ఎస్.. హోదాకు మద్దతుపై మాటల యుద్ధం

ఏపీ ప్రత్యేక హోదా అంశం టీడీపీ, టీఆర్ఎస్ మధ్య కొత్త పంచాయితీ పెట్టింది. టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలతో మొదలైన రగడ మరింత ముదురుతోంది. టీజీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు.

Samayam Telugu 21 Jun 2018, 1:13 pm
ఏపీ ప్రత్యేక హోదా అంశం టీడీపీ, టీఆర్ఎస్ మధ్య కొత్త పంచాయితీ పెట్టింది. టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలతో మొదలైన రగడ మరింత ముదురుతోంది. టీజీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. ఆయన తెలివి లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ కేకే మండిపడ్డారు. కేసీఆర్‌పై ఆయన చేసిన వాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. తెలంగాణ ఉద్యమ సమయంలో వెంకటేష్ ఎలా వ్యవహరించారో తెలుసన్నారు. మరోవైపు హోంమంత్రి నాయిని కూడా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించలేదని.. టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలన్నారు.
Samayam Telugu TG..


ఇక టీజీ వ్యాఖ్యల విషయానికొస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి కేసీఆర్‌ కూడా చేతులు కలపాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని కేసీఆర్‌ మాట ఇచ్చారని.. దాన్ని నిలుపుకోవాలన్నారు. ఆయన కలిసి రాకపోతే.. కర్ణాటకలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ఓటర్లకు పిలుపునివ్వాల్సి వస్తుందన్నారు. ఢిల్లీ నీతి ఆయోగ్‌ సమావేశానికి ముందే కేసీఆర్‌ ప్రధానిని కలిశారని.. నీతి ఆయోగ్‌ సమావేశంలో కూడా ఏపీ సమస్యలపై కేసీఆర్‌ మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ మోడీ వలలో పడకూడదన్నారు టీజీ. ఈ వ్యాఖ్యలకే టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.