యాప్నగరం

గోషామహల్ నుంచి బరిలో దానం నాగేందర్‌!

తొలి జాబితాలో టికెట్ ఖరారు కాకపోవడంతో అలక చెందిన దానంను టీఆర్‌ఎస్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ నుంచి కాకుండా గోషామహల్ బరి నుంచి పోటీ చేయించే అవకాశం.

Samayam Telugu 10 Sep 2018, 7:43 pm
కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ నేత దానం నాగేందర్‌కు టికెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. గులాబీ అధినేత ఆయనకు గోషామహల్ టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. మరో 3, 4 రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మిగిలిన స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
Samayam Telugu danam


గులాబీ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్‌.. ఖైరతాబాద్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే కేసీఆర్ 105 అభ్యర్థులను ప్రకటించడం, ఆ జాబితాలో దానం పేరులేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దానంకు గోషామహల్ టికెట్ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చినట్లు సమాచారం.

నేనేమన్నా గంగిరెద్దునా..!
టికెట్‌ ఖరారు చేయకపోవడంతో దానం అసంతృప్తి చెందినట్లు వస్తున్న వార్తలపై దానం సోమవారం (సెప్టెంబర్ 10) స్పందించారు. తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీకి విధేయుడిగా ఉంటానని, టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని దానం చెప్పారు.

తరచూ పార్టీలు మారడానికి తానేమీ గంగిరెద్దును కాదని దానం అన్నారు. ఎలాంటి ఒప్పందం లేకుండానే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. పార్టీ మారాలనుకున్న నాయకులు వెళ్లిపోతే వెళ్లాలిగానీ.. ఇలా తనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని సూచించారు. టీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ కోటరీ ఉందనడం తప్పు అని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.