యాప్నగరం

దసరా తర్వాత మేనిఫెస్టో ప్రకటిస్తాం: కేటీఆర్‌

నిరుద్యోగ భృతిపై సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, ఎన్నికలకు తమ నేతలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు.

Samayam Telugu 13 Oct 2018, 10:57 pm
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలలో ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన తర్వాత పార్టీల అధినేతలు మేనిఫెస్టోలపై దృష్టి సారిస్తున్నారు. ఓవైపు సీట్ల సర్దుబాటే ఇంకా ఖరారు చేసుకోని మహాకూటమి మేనిఫెస్టో తయారు చేయడంలో బిజీగా ఉంది. మరోవైపు తమ ఎన్నికల మేనిఫెస్టోకు రూపకల్పన చేశామన్న ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్.. దసరా పండుగ తర్వాత టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు.
Samayam Telugu KTR


గత తరహాలో కాకుండా రైతులకు మేలు జరిగేలా ఏకకాలంలో రుణాలు మాఫీ చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ దాడులు జరిగితే స్పందించడం ఏంటని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేటీఆర్ ప్రశ్నించారు. ఓటుకు నోటు ద్వారా ఎమ్మెల్సీ స్థానాన్ని నెగ్గాలని గతంలో ప్రయత్నించినట్టే, ప్రస్తుతం చంద్రబాబు 500 కోట్లు ఖర్చుపెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ను తెలంగాణకు తేవడాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్‌కు ఎన్నికలు కొత్త అని పేర్కొన్న కేటీఆర్.. మహాకూటమి ఓటమి తథ్యం అన్నారు. ప్రజా ప్రతినిధులపై ఎన్నికల్లో వ్యతిరేకత సర్వసాధారమని చెప్పారు. నిరుద్యోగ భృతిపై సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, ఎన్నికలకు తమ నేతలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.