యాప్నగరం

టీఆర్ఎస్ మంత్రులు త్వరలో కాంగ్రెస్‌లోకి!

ఏంటేంటి.. త్వరలోనే అధికార టీఆర్ఎస్ మంత్రులు, కొత్త మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారా? తమ భవిష్యత్తుపై అనుమానాలున్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారా? కేసీఆర్‌కు షాక్ ఇచ్చేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారా?..

TNN 30 Aug 2017, 11:14 am
ఏంటేంటి.. త్వరలోనే అధికార టీఆర్ఎస్ మంత్రులు, కొత్త మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారా? తమ భవిష్యత్తుపై అనుమానాలున్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారా? కేసీఆర్‌కు షాక్ ఇచ్చేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారా?.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాటలు చూస్తుంటే ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని భట్టి జోష్యం చెప్పారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం కొంతమంది కాంగ్రెస్ నేతలతో కలసి భట్టి మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ ఎత్తున నేతలు వలస స్తారని చెప్పారు.
Samayam Telugu trs ministers and mlas on touch with us says congress leader bhatti vikramarka
టీఆర్ఎస్ మంత్రులు త్వరలో కాంగ్రెస్‌లోకి!


‘టీఆర్ఎస్‌కు చెందిన 7, 8 మంది మంత్రులు.. ఓ 15 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్‌లో ఉన్నారు. సరైన సమయంలో వారంతా కాంగ్రెస్‌లోకి వస్తారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణితో నేతలంతా విసుగుపోయారు. ప్రభుత్వంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బలంగా ఉంది. క్షేత్ర స్థాయితో తిరుగుతున్న అధికార పార్టీ నేతలు దీన్ని గుర్తించారు. అందుకే వారు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వస్తున్నారు. మా పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినవారిలో కొందరు మాకు కోవర్టులుగా పనిచేస్తు్న్నారు. వారు కూడా సరైన సమయంలో వెనక్కి వస్తారు. తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు నేతలు మా పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు’ అని భట్టి వివరించారు.

మంత్రుల్లో ఎవరెవరు వచ్చే అవకాశముందని ఓ విలేకరి అడగగా.. దయచేసి పేర్లు అడగొద్దని, దాని వల్ల వారికి తమకు ఇబ్బందని భట్టి బదులిచ్చారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి ఖాయమని భట్టి గట్టిగా చెప్పారు. టీఆర్ఎస్ నేతలు తమవైపు చూడటానికి ఇది కూడా ఒక కారణమని అన్నారు. అయితే భట్టి మాటలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ చెబుతున్నా.. బయట అంత ప్రభావం కనిపించడంలేదు. మరోవైపు కాంగ్రెస్ పుంజుకున్నట్లు అనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చే సాహసం చేస్తారా? భట్టి మాటలు నిజమో.. కాదో.. తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.