యాప్నగరం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కరీంనగర్ కలెక్టర్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ మధ్య వాగ్వాదం నెలకొంది.

Samayam Telugu 1 Mar 2017, 9:57 pm
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ మధ్య వాగ్వాదం నెలకొంది. ‘డోంట్ టాక్’ అంటూ ఎమ్మెల్యే వైపు కలెక్టర్ వేలెత్తి హెచ్చరిస్తే...బాలకిషన్ క్షమాపణకు డిమాండ్ చేశారు.
Samayam Telugu trs mla rasamai verses karim nagar collector
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కరీంనగర్ కలెక్టర్


బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో డిజిధన్ మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్ లు సహా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వేదికపై ఏర్పాటు చేసిన ప్లెక్సీపై స్థానిక ఎంపీ వినోద్ కుమార్ ఫొటో లేకపోవడంతో వివాదం రాజుకుంది. ఎంపీ ఫొటో ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యేలు గంగుల, రసమయి కాసేపు స్టేజీ కింద ఆందోళన చేశారు. అనంతరం స్టేజీపైకి వెళ్తూ..‘ఎంపీ ఫొటో పెట్టకపోవడం దారుణమని రసమయి..కలెక్టర్ తో అన్నారు. మళ్లీ ఇలాంటివి పునరావృత్తం కాకూడదని గుర్తు చేశారు. దీంతో కలెక్టర్...రసమయిని ఉద్దేశిస్తూ ‘డోంట్ టాక్ లైకి దిస్’ అని వేలెత్తి చూపిస్తూ హెచ్చరించారు. రసమయి కూడా అదే విధంగా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధం కాగా..ఈటల, వినోద్ లు సహా ఇతర నేతలు సమదాయించారు.

కాగా, తనను అమానించిన కలెక్టర్ క్షమాపణ చెప్పాలని రసమయి డిమాండ్ చేశారు.
జనవరి 26 రిపబ్లిక్ వేడుకల సందర్భంగా కేసీఆర్ ను పొగడుతూ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.