యాప్నగరం

అమిత్ షాతో టీఆర్ఎస్ ఎంపీ భేటీ.. బీజేపీలో చేరతారా?

అమిత్ షాతో సమావేశమైన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్). టీఆర్ఎస్ పార్లమెంటరీపక్ష సమావేశానికి హాజరైన మరుసటి రోజే కలవడంతో రాజకీయంగా ప్రాధాన్యత.

Samayam Telugu 11 Jul 2019, 10:06 pm
కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) భేటీ అయ్యారు. ఢిల్లీలో గురువారం అమిత్‌షాను కలిశారు. ఈ ఇద్దరు నేతలు అరగంటకుపైగా సమావేశమైనట్లు తెలుస్తోంది. షాతో డీఎస్ ఏం చర్చించారన్నది క్లారిటీ రాలేదు. కొంతకాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న ఎంపీ బీజేపీ అధ్యక్షుడ్ని కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలయ్యింది.
Samayam Telugu ds


మరోవైపు బుధవారం ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీపక్ష సమావేశాకి డీఎస్ హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎంపీ.. ఉన్నట్టుండి సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశమయ్యింది. ఆయన టీఆర్‌ఎస్‌లో కొనసాగుతారని అందరూ భావించారు. కానీ మరుసటి రోజే ఇలా అమిత్ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించకుంది.

ఇటు లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్‌ కుమారుడు అరవింద్ నిజామాబాద్‌ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. విజయం సాధించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించారు. తండ్రి టీఆర్ఎస్‌లో కుమారుడు బీజేపీలో ఉండటంపై రక,కరకాల చర్చ జరిగింది. డీఎస్ కూడా బీజేపీలోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అమిత్ షాను కలవడం ఆసక్తిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.