యాప్నగరం

విభజన అన్యాయం అనొద్దు.. టీడీపీ ఎంపీలపై కేకే మండిపాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటూ టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కె కేశవరావు (కేకే) తీవ్ర అభ్యంతరం తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా విభజన బిల్లు ఆమోదం పొందగా.. అన్యాయం అంటే అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Samayam Telugu 24 Jul 2018, 5:23 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటూ టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కె కేశవరావు (కేకే) తీవ్ర అభ్యంతరం తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా విభజన బిల్లు ఆమోదం పొందగా.. అన్యాయం అంటే అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీ విభజన అన్యాయం అంటే చట్ట సభలను అగౌరవపరిచినట్లేనని ఆయన చెప్పారు. సభలో సభ్యులు, ఛైర్మన్ ఉన్నప్పుడే బిల్లు పాసైందని, అలాంటప్పుడు అన్యాయం ఎక్కడుందని టీఆర్‌ఎస్ ఎంపీ వివరించారు. మంగళవారం (జులై 24) రాజ్యసభలో ఏపీ విభజన చట్టం, ప్రత్యేక హోదా అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చలో కేకే మాట్లాడారు.
Samayam Telugu kk


వందలాది అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం అని కేశవరావు అన్నారు. తెలంగాణ ఉద్యమం 1969 నుంచే ఉధృతంగా కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దశాబ్దాల పోరాట ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందని, రాష్ట్ర ఏర్పాటును అన్యాయం అని తమను చులకన చేయొద్దని టీడీపీ ఎంపీలకు ఆయన హితవు పలికారు.

ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న వారు.. తెలంగాణకు జరిగిన అన్యాయంపై నోరు విప్పరేమని కేకే ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన సీలేరు ప్రాజెక్టు, 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని ఆయన అన్నారు. పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.