యాప్నగరం

ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి నిధికి అసెంబ్లీ ఆమోదం

షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ)ల ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు శుక్రవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.

Samayam Telugu 24 Mar 2017, 8:38 pm
షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ)ల ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు శుక్రవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. చర్చ అనంతరం ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.
Samayam Telugu ts assembly okayed sc sts special development fund
ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి నిధికి అసెంబ్లీ ఆమోదం


ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దళితుల కోసం కాంగ్రెస్ చేసిన చట్టం కంటే తాము మెరుగైన చట్టం రూపొందించామని అన్నారు.

దళితుల అభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం లోపంగా మారిందన్నారు. నూటికి నూరుశాతం బిల్లును అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతీ జిల్లాలో దళిత, గిరిజన ఎమ్మెల్యేలతో విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి పకడ్బందీగా అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

2014-15 సంవత్సరంలో 17.87 శాతం, 2015-16లో 15.4 శాతం మేర నిధులు దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేసినట్లు చెప్పిన సీఎం.. గతంలో ఏ ప్రభుత్వాలు 12 శాతానికి మించి దళితుల కోసం ఖర్చు పెట్టలేదన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల ఖర్చుపై ప్రతి ఆరు నెలలకొకసారి ఆడిట్ జరగాలన్నారు.

గత ప్రభుత్వాలు రూపొందించిన చట్టంలో 109 తప్పులున్నాయని కేసీఆర్ అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు బిందు, తుంపర సేద్యం పరికరాలు 90, 100 శాతం సబ్సిడీతో ఇస్తున్నామని పేర్కొన్నారు. దళితులను పారిశ్రామిక వేత్తలుగా చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని కేసీఆర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.