యాప్నగరం

స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆయన సతీమణి స్వైన్ ఫ్లూతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు

Samayam Telugu 28 Jan 2017, 7:51 am
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆయన సతీమణి స్వైన్ ఫ్లూతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కొన్నాళ్లుగా జ్వరం, దగ్గు, జలుబు, గొంతి నొప్పి సమస్యలతో బాధపడుతూ ఐదు రోజుల క్రితం వీరు నిమ్స్ లో చికిత్స కోసం చేరారు.
Samayam Telugu ts deputy cm mohamud ali suffers swine flu
స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం


మహమూద్ అలీ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, రక్తనమునాలను ఐపీఎంకు పంపినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.

కాగా, స్వైన్ ఫ్లూ లక్షణాలతో రాష్ట్రంలో ముగ్గురు శిశువులకు వివిధ ఆస్పత్రుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.