యాప్నగరం

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణాలో ఎంసెట్ పరీక్షా ఫలితాలను సోమవారం విడుదల చేశారు.

TNN 22 May 2017, 1:57 pm
తెలంగాణాలో ఎంసెట్ పరీక్షా ఫలితాలను సోమవారం విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జెఎన్టీయూలో తెలంగాణ ఉన్నత మండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. విడుదలైన ఫలితాల ప్రకారం... ఇంజినీరింగ్ విభాగంలో 74.5 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత చెందగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 86.49 శాతం ఉత్తీర్ణత చెందారు. మే 12న ఎంసెట్ పరీక్ష నిర్వహించగా పదిరోజుల వ్యవధిలోనే ర్యాంకులను విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ.
Samayam Telugu ts eamcet result 2017 declared today
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల


ఇంజనీరింగ్‌ విభాగంలో గోరంట్ల జయంత్‌ అనే విద్యార్థి 156 మార్కులతో టాపర్ గా నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో రాంగోపాల్‌ 156 మార్కులతో , సాయియశస్వీ భరద్వాజ్‌ 155 మార్కులతో నిలిచారు. కాగా టాప్ టెన్ ర్యాంకుల్లో ఆరింటిని ఏపీకి చెందిన విద్యార్థులే దక్కించుకోవడం విశేషం. విద్యార్థులు మే 24 నుంచి మే 26 వరకు ఓఎమ్ఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఫలితాలకు eamcet.tsche.ac.in , tsche.cgg.gov.in వెబ్ సైట్ లను చూడగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.