యాప్నగరం

కేంద్రప్రభుత్వంది మిలీనియం జోక్: హరీష్

తెలంగాణలో పండించిన మిర్చి కొనుగోలుపై కేంద్రప్రభుత్వ ప్రకటన మిలీనియం జోక్ అని మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

Samayam Telugu 4 May 2017, 2:14 pm
తెలంగాణలో పండించిన మిర్చి కొనుగోలుపై కేంద్రప్రభుత్వ ప్రకటన మిలీనియం జోక్ అని మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుతం విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 7 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పండిందని కేంద్రం మాత్రం 33 వేల మెట్రిక్ టన్నులు అయితేనే కొనుగోలు చేస్తామని చెప్పడం దారుణమని అన్నారు. నాణ్యమైన మిర్చిని మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టడం సరికాదన్నారు.
Samayam Telugu ts minister harishrao says centre purchase mirchi is a joke
కేంద్రప్రభుత్వంది మిలీనియం జోక్: హరీష్


మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించిన హరీష్.. మిర్చి క్వింటాల్‌కు రూ. 5 వేలు ఇవ్వడమంటే రైతులకు శఠగోపం పెట్టడమేనని మండిపడ్డారు.

మిర్చి క్వింటాల్ కు రూ.7వేలు చెల్లించేలాని చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే లేఖ రాసిందని గుర్తు చేశారు. మిర్చి, పసుపు పంటల కనీస మద్దతు ధర నిర్ణయించాల్సింది కేంద్రమేనని హరీష్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.