యాప్నగరం

బతుకమ్మపై పోస్టల్ స్టాంప్: కవిత

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మపై పోస్టల్ స్టాంప్ విడుదల కోసం కృషి చేస్తానని

Samayam Telugu 23 Sep 2016, 1:14 pm
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మపై పోస్టల్ స్టాంప్ విడుదల కోసం కృషి చేస్తానని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గురువారం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగలోపే పోస్టల్ స్టాంప్ విడుదల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. మహిళల్లో సృజనాత్మకత, కళాత్మాకతకు ప్రపంచానికి చాటి చెప్పేది బతుకమ్మ పండుగ అని అన్నారు. కళలు గుర్తించి గౌరవించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుందని గుర్తు చేసిన ఆమె...మహిళా చిత్రకారులను ప్రోత్సహించేందుకు ‘ఇంటర్నెషనల్ ఆర్ట్ ఫెస్టివల్ ఫర్ విమెన్’ ను నవంబర్ మొదటివారంలో నిర్వహిస్తామని వెల్లడించారు.
Samayam Telugu ts to launch a postal on bathukamma says kavitha
బతుకమ్మపై పోస్టల్ స్టాంప్: కవిత



TRS MP K. Kavitha says a postal stamp will be released on Bathukamma soon. Bathukamma festival resembles the socio cultural aspects of Telangana, she added. Inaugurating the Art exhibition at State Art Gallery MP Kavitha announced the International Art Festival for Women would be conducted on the first week of November.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.