యాప్నగరం

త్వరలో హుస్సేన్ సాగర్‌లో రెండు ఐల్యాండ్‌లు

హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్న హుస్సేన్ సాగర్‌లో రెండు ఐల్యాండ్‌లు నిర్మించనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ డాక్టర్ టి. చిరంజీవులు వెల్లడించారు.

TNN 13 Jul 2017, 1:52 pm
హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్న హుస్సేన్ సాగర్‌లో రెండు ఐల్యాండ్‌లు నిర్మించనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ డాక్టర్ టి. చిరంజీవులు వెల్లడించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. సంజీవయ్య పార్క్, జల విహార్ మధ్య ఈ ఐల్యాండ్‌లను నిర్మించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ యాచ్ క్లబ్‌లో బుధవారం సాయంత్రం జరిగిన తెలంగాణ స్టేట్ ఓపెన్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవులు ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు.
Samayam Telugu two islands to come up on hussain sagar lake very soon hmda
త్వరలో హుస్సేన్ సాగర్‌లో రెండు ఐల్యాండ్‌లు


రాబోయే నాలుగు ఐదు నెలల్లో ఈ ఐల్యాండ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఒక్కో ఐల్యాండ్‌ను ఎకరం విస్తీర్ణంలో నిర్మించినున్నట్లు వివరించారు. సాగర్‌లో నుంచి తీసిన చెత్తచెదారంతో ఈ ఐల్యాండ్‌లను నిర్మిస్తామని తెలిపారు. అందుకనే సాగర్ నుంచి తీసిన చెత్తను సరస్సుకు ఒకవైపు ఉంచామన్నారు. ఈ ఐల్యాండ్‌లపై పచ్చని మొక్కలు, గడ్డిని పెంచి సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తామన్నారు. సాగర్‌లోని చెత్తనే వాడి ఐల్యాండ్‌లు నిర్మించడం వల్ల బయటి నుంచి మెటీరియల్‌ను తెచ్చే అవసరం ఉండదని చెప్పారు. దీనికి వల్ల నిర్మాణ ఖర్చు కూడా చాలా తగ్గుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.