యాప్నగరం

ఆ సర్వే రిపోర్ట్ కోసం సీఎం ఎదురు చూపులు!

ఎన్నికల వేడి ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే మూడు సర్వేలు చేయించుకున్నారట. వీటిలో మూడో సర్వే కోసం ఆయన వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది.

TNN 7 Feb 2018, 5:00 pm
దేశంలో అప్పుడే ఎన్నికల హడావిడి పెరిగిపోయింది. 2019లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. మోదీ దూకుడును చూస్తే.. ముందస్తుకు ముహూర్తం సిద్ధం అవుతోందన్న సంకేతాలు అందుతున్నాయి. అందుకే తెలుగు నాట కూడా ఎన్నికల వేడి మొదలైంది. ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య హోరాహోరీ తప్పదనిపిస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంటనే విషయమై కేసీఆర్ సర్వే చేయించారు.
Samayam Telugu two out of three surveys predict a landslide victory for trs kcr waiting for third report
ఆ సర్వే రిపోర్ట్ కోసం సీఎం ఎదురు చూపులు!


కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో మూడు ఏజెన్సీలు సర్వేలు నిర్వహించగా.. టీఆర్ఎస్‌కు బంపర్ మెజార్టీ ఖాయమని రెండింట్లో తేలింది. రెండు సర్వేల్లోనూ గులాబీ పార్టీకి 100కి పైగా సీట్లు వస్తాయని వెల్లడైంది. ఇక మూడో సర్వే నివేదిక కోసం కేసీఆర్ ఎదురు చూస్తున్నారు. మూడో సర్వే రిపోర్ట్ కూడా వెల్లడైతే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది.

టీఆర్ఎస్‌కు 105 సీట్లు వస్తాయని ఒక సర్వే చెప్పగా, 103 సీట్లొస్తాయని మరో సర్వేలో తేలింది. బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని రెండు సర్వేలు చెప్పడం విశేషం. ప్రస్తుతం ఆ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.