యాప్నగరం

బోరుబావిలోనే బాలిక: క్షణక్షణం ఉత్కంఠ

బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన పద్దెమినిది నెలల పాప కోసం చేవేళ్లలోని ఎక్కడారెడ్డిగూడలో సహాయక చర్యలు

Samayam Telugu 23 Jun 2017, 3:36 pm
బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన పద్దెమినిది నెలల పాప కోసం చేవేళ్లలోని ఎక్కడారెడ్డిగూడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాలిక బోరుబావిలో పడి 21 గంటలు గడుస్తున్నాయి. పోలీస్, రెవెన్యూ యంత్రాంగం బాలిక పడిపోయిన బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వే కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Samayam Telugu two year old girl fall into borewell in telangana rescue mission underway
బోరుబావిలోనే బాలిక: క్షణక్షణం ఉత్కంఠ


బోరుబావిలో ఉన్న మోటార్ పై పాప పడిపోయిన వివిధ సాంకేతిక పరికరాలతో మోటార్ ను పైకి తీశారు. రోబోటిక్ హ్యాండ్ క్లిప్ ద్వారా చిన్నారిని బయటకు తీసేందుకు విఫలయత్నం చేశారు. 40 అడుగుల లోతు నుంచి మోటార్ పైకి వచ్చిన పాప జాడ మాత్రం తెలియరాలేదు. మెటార్ పై నుంచి పాప జారిపడిపోయిందని అనుమానిస్తున్నారు. దీంతో ఆ పసిపాప తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


ఎన్డీఆర్ ఎఫ్ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. పసిపాప పడిపోయిన బోరుబావి 500 అడుగులలోతు ఉందని తెలుస్తోంది. బోరుబావికి సమాంతరంగా 40అడుగుల లోతువరకు తొవ్వకాలు చేపట్టారు. చిన్నారికి నిరంతరం ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.