యాప్నగరం

అమెరికా, ఇండియా సహజ భాగస్వాములు: కేథరిన్ హడ్డా

అమెరికా, ఇండియా సహజసిద్ధమైన భాగస్వాములని, ఇరుదేశాల స్నేహసంబంధాలు మున్ముందు మరింత బలపడతాయని అమెరికా కాన్సులేట్ జనరల్‌ కేథరిన్ హడ్డా అన్నారు.

TNN 29 Jun 2017, 1:56 pm
అమెరికా, ఇండియా సహజసిద్ధమైన భాగస్వాములని, ఇరుదేశాల స్నేహసంబంధాలు మున్ముందు మరింత బలపడతాయని అమెరికా కాన్సులేట్ జనరల్‌ కేథరిన్ హడ్డా అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో ఇండో - అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(IACC) ఆధ్వర్యంలో ఆమెరికా 241వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు కేథరిన్ హడ్డా గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంప్‌ స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడిన వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగో వ్యక్తి అన్నారు. ఇండియా పట్ల అమెరికాకు ఉన్న గౌరవానికి అది నిదర్శనమన్నారు.
Samayam Telugu us and india are natural partners says katherine hadda us consul general hyderabad
అమెరికా, ఇండియా సహజ భాగస్వాములు: కేథరిన్ హడ్డా


భారత్‌లో జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్(GES)లో పాల్గొనే యూఎస్ ప్రతినిధుల బృందానికి ప్రాతినిధ్యం వహించాల్సిందిగా ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ అంగీకరించారని కేథరిన్ చెప్పారు. భారత్, అమెరికా దేశాలు ప్రస్తుతం అతిపెద్ద రక్షణ భాగస్వాములన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సైతం ఇరుదేశాలు సహకరించుకుంటున్నాయని తెలిపారు. భారత్ చేపట్టిన చరిత్రాత్మక మాస్ ఆర్బిటర్ మిషన్‌ను నాసా ఎంతగానో ప్రోత్సహించిందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న ఆరు ఏపీ1000 అణు విద్యుత్తు ప్రాజెక్ట్‌లకు అమెరికా సాంకేతిక సహాయం అందించనుందన్నారు.

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత్, అమెరికాల మధ్య దృఢమైన బంధముందన్నారు. అమెరికాలోని న్యూయార్క్ పోలీసుల సహాయంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో టెక్నాలజీ ఫ్యుజన్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. దీనికి రూ. 300 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ రీజినల్ ప్రెసిడెంట్ ఆర్‌బీవీవీఎన్‌ రాజు, సుమారు 100 మంది ఐఏసీసీ సభ్యలు, తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.