యాప్నగరం

15 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం: ఉత్తమ్

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలకు రెండు సర్వేలు చేసిన తర్వాత టికెట్లు ఇస్తామని ఉత్తమ్ వెల్లడించారు.

Samayam Telugu 20 Sep 2018, 5:38 pm
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ హైకమాండ్ 9 కీలక కమిటీలను ఏర్పాటు చేసి పలువురు సీనియర్ నేతలకు చైర్మన్లుగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, తమకు అనుకున్న పదవి వచ్చిందని మరికొందరు నేతల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Samayam Telugu Uttam Kumar Reddy


ఎన్నికల విషయంలో తమ విధివిధానాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు దాదాపు 15 రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. అయితే రాష్ట్ర ఓటర్ల జాబితాల్లో తప్పులు అధికంగా ఉండటంతో పాటు ఓట్ల తొలగింపుపై భారీగా ఫిర్యాదులు రావడం.. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను అయోమయానికి గురి చేసిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగుస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్లు అశిస్తున్న నేతల దరఖాస్తులు పరిశీలించి వారిపై రెండు సర్వేలు చేయించి, తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగితే సీట్ల పంపకాలపై స్పష్టత వస్తుందన్నారు. అయితే మిత్రపక్షాలు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాలు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. తమ దృష్టికి రాలేదన్నారు. సర్వేల ఫలితాలు పరిశీలించి నేతల జాబితాను పీసీపీ సంప్రదింపుల కమిటీకి నివేదిక అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఏ అజెండా రూపొందించలేదని, మిత్రపక్షాలతో చర్చల తర్వాత తమ మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.