యాప్నగరం

అవయవదానం చేసి అమరుడైన వంశీ...

అన్ని దానాల్లో కెల్లా అవయవ దానం గొప్పది.. ఇది మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చూపించాడు మన వంశీ.

TNN 19 Oct 2016, 10:41 am
విజయవాడ: అన్ని దానాల్లో కెల్లా అవయవదానం గొప్పది.. ఇది మాటలకే చాలా వరకు పరిమితమౌతోంది.. కానీ మన వంశీ చేతల్లో చూపించాడు.. వివరాల్లోకి వెళ్లినట్లయితే జగ్యయపేటలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో హార్డ్ వేర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న వంశీ మంగళవారం బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడు. చికిత్స సమయంలో తను తిరిగి మామూలు మనిషి అయ్యే పరిస్థితి లేదని తెలుసుకున్న వంశీ ..ఇతరులకు పునర్జన్మ ప్రసాదించాలని నిర్ణయించాడు . తను చనిపోయిన తర్వాత అవయవాలు వేరోకరికి దానం చేయాలని అతని తల్దిదండ్రులకు చెప్పాడు.. ఇంతలో వంశీ విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీంతో అతని తల్లిదండ్రులు వంశీ అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
Samayam Telugu vamsi donated his organs ofter his death
అవయవదానం చేసి అమరుడైన వంశీ...


తల్లిదండ్రుల అనుమతితో వంశీకి పోర్టుమార్టం నిర్వహించి అతని గుండె, కళ్లు, లివర్ సహా శరీరంలోని కీలక అవయవాలను వైద్యులు సేకరించారు. ప్రస్తుతం వంశీ అవయవాలు విజయవాడ, హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న పలువురు రోగుల కోసం తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా వంశీ భౌతికంగా తమ మధ్య లేకపోయినా తమ మదిలో శాశ్వతంగా నిలిచిపోయాడని వంశీ స్నేహితులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.