యాప్నగరం

దత్తాత్రేయ స్థానంలో కేబినెట్‌లో చేరనున్న తెలుగు వ్యక్తి..

కేంద్ర కేబినెట్‌ విస్తరణకు సంబంధించి తీవ్రమైన మల్లగుల్లాలు జరుగుతున్నాయి. బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన స్థానంలో ఎవరినీ తీసుకుంటారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జల వనరుల నిపుణుడు వెదిరె శ్రీరామ్‌..

TNN 7 Dec 2022, 12:38 pm
కేంద్ర కేబినెట్‌ విస్తరణకు సంబంధించి తీవ్రమైన మల్లగుల్లాలు జరుగుతున్నాయి. బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన స్థానంలో ఎవరినీ తీసుకుంటారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జల వనరుల నిపుణుడు వెదిరె శ్రీరామ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. భువనగిరికి చెందిన వెదిరె శ్రీరామ్‌ రెడ్డి ప్రస్తుతం కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. గంగా నది ప్రక్షాలన దిశగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వెనక ఉన్న కీలక వ్యక్తి ఈయనే. 15 ఏళ్ల పాటు అమెరికాలో ఓ ఎమ్మెన్సీలో పని చేసిన శ్రీరామ్‌ 2014 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు.
Samayam Telugu Modi


దత్తాత్రేయ స్థానంలో పార్టీ సీనియర్‌ నేత మురళీధర్‌రావును తీసుకుంటారని వినిపించినా.. తాజాగా వెదిరె శ్రీరామ్‌ రేసులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హరిబాబుకు కేంద్ర కేబినెట్‌లో చాన్స్‌ ఇవ్వడంపై సందిగ్ధత అలాగే కొనసాగుతూ ఉంది. ఆదివారం (సెప్టెంబర్ 3) ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ నూతన మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.