యాప్నగరం

ఆసక్తిదాయక పోరు: వైసీపీ అభ్యర్థి నామినేషన్

టీడీపీ కూడా అభ్యర్థిని పోటీలో పెట్టి సై అంటుందా?

TNN 7 Mar 2018, 1:09 pm
ఏపీ అసెంబ్లీ కోటాలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు అయ్యింది. ముందుగా ప్రకటించిన అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అమరావతిలో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారాయన. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Samayam Telugu vemireddy files his nomination for rs seat
ఆసక్తిదాయక పోరు: వైసీపీ అభ్యర్థి నామినేషన్


ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ.. తనకు వైఎస్ కుటుంబంతో నలభై సంవత్సరాలుగా అనుబంధం ఉందని, జగన్ తనకు మంచి గౌరవం ఇచ్చారని చెప్పారు. ఇక్కడ ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ మూడో రాజ్యసభ సీటుకు కూడా అభ్యర్థిని నిలబెడుతుందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. బలాబలాల ప్రకారం తెలుగుదేశం పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కుతాయి. అయితే మూడో సీటుకు కూడా ఆ పార్టీ అభ్యర్థిని నిలిపితే.. వైసీపీ, టీడీపీలు అమీతుమీ తలపడతాయి.

ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. ప్రస్తుతం ఉన్న బలాన్ని బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ తరఫున మూడో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయకపోతే.. ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. నామినేషన్ దాఖలైతే మాత్రం రసవత్తర పోరు తప్పదు. ఇప్పటికే తమ వైపు ఉన్న 44 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు నిర్వహణకు సిద్ధం అవుతోందని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.