యాప్నగరం

శిక్షణ ఇస్తే మహిళలు మరింత రాణిస్తారు: వెంకయ్య

హైదరాబాద్‌లోని విద్యానగర్ ఏటీఐ (అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్)లో రీజినల్ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌వీటీఐ)కు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాంతీయ వృత్తి విద్య శిక్షణ కేంద్రంలో ఏటా 1000 మంది విద్యార్థులకు శిక్షణ..

TNN 16 Sep 2017, 2:11 pm
హైదరాబాద్‌లోని విద్యానగర్ ఏటీఐ (అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్)లో రీజినల్ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌వీటీఐ)కు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాంతీయ వృత్తి విద్య శిక్షణ కేంద్రంలో ఏటా 1000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య ప్రసంగిస్తూ.. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, వారికి తగిన శిక్షణ అందించాలని అన్నారు. దేశంలో మహిళల విద్య 65 శాతమే ఉందని.. ఇది మరింత పెరగాలని ఆయన ఆకాక్షించారు. ప్రతి రంగంలోనూ మహిళలకు అవకాశం కల్పించాలని కోరారు.
Samayam Telugu venkaiah naidu inaugurates regional vocational training institute in hyderabad
శిక్షణ ఇస్తే మహిళలు మరింత రాణిస్తారు: వెంకయ్య


ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేయాలని వెంకయ్య సూచించారు. ‘నైపుణ్య రంగంలో మన దేశంలో సరైన శిక్షణ లేదు. మన దేశం కంటే చిన్న దేశాలు ఎలక్ట్రానిక్‌ రంగంలో దూసుకెళుతున్నాయి. యువతరానికి తగిన శిక్షణ ఇస్తే తమ కాళ్లపై తాము నిలబడతారు. ఐటీఐలు ఖాళీగా ఉండటం దురదృష్టకరం. వాటిలో అధునాతన కోర్సులు ప్రవేశపెట్టాలి’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య.. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. వెంకయ్యతో పాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, హోం మంత్రి నాయిని, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆర్‌వీఐటీ ప్రత్యేకతలు
* తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త సంస్థ.
* అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సుమారుగా 4 ఎకరాల్లో విస్తరించి ఉంది.
* ఆర్‌వీటీఐలో ఏటా సుమారు 1000 మందికి శిక్షణ అందిస్తారు.
* ఫ్యాషన్ డిజైన్, టెక్నాలజీ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, కాస్మిటాలజి, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీస్ అసిస్టెంట్ మొదలైన కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
* భారత ప్రభుత్వ పరిధిలోని ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్’ ఈ కోర్సులకు గుర్తింపు ఇస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.