యాప్నగరం

హరికృష్ణకు నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి

రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి గురువారం (ఆగస్టు 30) ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. అనంతరం నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Samayam Telugu 30 Aug 2018, 12:23 pm
రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి గురువారం (ఆగస్టు 30) ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. అనంతరం నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్భీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, తండ్రికి తగ్గ తనయుడిగా వ్యవహరించే హరికృష్ణ మరణం తనను కలచి వేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
Samayam Telugu వెంకయ్యనాయుడు


హరికృష్ణ ఏ విషయంలోనైనా సరే చెప్పదలచుకున్నదాన్ని కుండబద్దలు కొట్టేవారు. రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుపడితే, ఆనాడు సభాపతి నిబంధనల ప్రకారం అభ్యంతరం చెబితే తాను మాతృభాషలో మాట్లాడేందుకు అనుమతివ్వమని సభాపతికి సర్దిచెప్పానన్నారు. హరికృష్ణకు తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉందన్నారు. తెలుగు జాతి ఖ్యాతి, గౌరవాన్ని ప్రపంచం నలుదిశలా వ్యాప్తి చేసిన ఎన్టీరామారావుకు సరైన వారసుడు హరికృష్ణ అని వెంకయ్య అభిప్రాయపడ్డారు.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హరికృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.