యాప్నగరం

మళ్లీ క్రీయాశీల రాజకీయాల్లోకి రాములమ్మ?!

సమయం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతానని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు.

Samayam Telugu 20 Jan 2017, 10:16 am
సమయం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతానని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. టిఆర్ఎస్ ఎంపీగా ఐదేళ్లుగా లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసిన ఆమె... 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరి..ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె క్రీయశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ చెన్నైకే పరిమితమయ్యారు.
Samayam Telugu vijaya shanthi comes back to politics
మళ్లీ క్రీయాశీల రాజకీయాల్లోకి రాములమ్మ?!


ఆ తర్వాత తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పారు. సరైన కథతో కమ్ బ్యాక్ కావాలని ఆమె యోచిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోవడం...తన పాలిటిక్స్ కు ఎంట్రీగా ఉన్న బీజేపీ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తే బీజేపీలో చేరాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ఆ విషయంపై ఆమె స్పష్టత ఇవ్వకపోయినా..సమయం వచ్చినప్పుడు తన రాజకీయాల గురించి మాట్లాడతానని ఆమె గురువారం అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో లక్డీకాపూల్‌లో చేపట్టిన రైల్‌రోకో ఘటనలో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆమె కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ ఈనెల 24కు వాయిదా పడింది.

1998లో బీజేపీలో చేరిన విజయశాంతి ఆ తరువాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. 2009లో పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసి..మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.