యాప్నగరం

తమిళ రాజకీయాల్లోకి కాదు..తెలుగులోనే..!

​ఎన్నికలు అయినప్పటి నుంచి తెలుగు రాజకీయ వార్తల్లో పెద్దగా కనిపించని మాజీ ఎంపీ విజయశాంతి.. తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

TNN 8 Nov 2017, 11:18 am
ఎన్నికలు అయినప్పటి నుంచి తెలుగు రాజకీయ వార్తల్లో పెద్దగా కనిపించని మాజీ ఎంపీ విజయశాంతి.. తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై.. రాజకీయాల్లో తిరిగి యాక్టివేట్ అవుతున్న సంకేతాలను ఇచ్చారు. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న కాంగ్రెస్ పార్టీ విజయశాంతితో ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలను భారీ ఎత్తున చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పార్టీలో ఉండి కూడా కామ్ గా ఉండిపోయిన వారికి పునరుత్తేజాన్ని కలిగించే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఉంది.
Samayam Telugu vijayashanti meets rahul returns to active politics
తమిళ రాజకీయాల్లోకి కాదు..తెలుగులోనే..!


అందుకే విజయశాంతిని ప్రత్యేకంగా రాహుల్ వద్దకు తీసుకెళ్లారట తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా కూడా ఉన్నారు. భేటీ సందర్భంగా విజయశాంతికి రాహుల్ కొన్ని హామీలు ఇచ్చారని సమాచారం.

తక్షణం విజయశాంతికి పార్టీలో ముఖ్యమైన హోదాలను ఇస్తారట. ప్రచార కమిటీలో విజయశాంతిని కీలకం చేయనున్నారని సమాచారం. అలాగే ఏఐసీసీ కమిటీలో కూడా విజయశాంతికి స్థానం కల్పించనున్నారని సమాచారం. గతంలో తెరాస తరఫున ఎంపీగా చేశారు విజయశాంతి. అయితే తెలంగాణ ఏర్పడే సమయంలో విబేధాలతో ఆ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఆమె తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తమిళనాట శశికళ వర్గంతో విజయశాంతి సన్నిహితంగా మెలిగింది. రద్దు అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ తరఫున ఆమె ప్రచారం కూడా చేసింది. అయితే తమిళ రాజకీయాల్లో విజయశాంతి బిజీ కాలేకపోయింది. ఇప్పుడు మళ్లీ తెలుగు రాజకీయాల మీద, అందునా తెలంగాణ రాజకీయాల్లో ఆమె బిజీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.