యాప్నగరం

బెజవాడలో ఉత్సాహంగా హ్యాపీసండే

బెజవాడ వాసులకు ఆటవిడుపు కోసం నగర పాలక సంస్థ తలపెట్టిన హ్యాపీ సండే కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా సాగింది.

TNN 5 Jun 2016, 6:52 pm
ఆంధ్రుల తాత్కాలిక రాజధాని బెజవాడ వాసులకు ఆటవిడుపు కోసం నగర పాలక సంస్థ తలపెట్టిన హ్యాపీ సండే కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా సాగింది. ప్రతీ నెల మొదటి ఆదివారంనాడు విజయవాడ నగరపాలక సంస్థ హ్యాపీసండేను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 5 మొదటివారం కావడంతో హ్యాపీసండే ఏర్పాటుచేసారు. అందులో భాగంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటయిన మహాత్మగాంధీ (బందర్) రోడ్డుపై ఈ ఉదయం 6 నుండి 8 గంటల వరకు అంటే రెండు గంటలపాటు పోలీసులు పూర్తిగా ట్రాఫిక్ ను నిషేధించారు. వాహనాలు లేని రహదారిపైకి ఉత్సాహంగా తరలివచ్చిన ప్రజలు తమకు ఇష్టమైన ఆటలను ఆడుకున్నారు. చిన్నా పెద్ద తేడాలేకుండా అంతా రోడ్లపైకి వచ్చి ఆ రెండు గంటలను పూర్తిగా ఆస్వాదించారు. పలువురు నగర వాసులు సైక్లింగ్, డ్యాన్స్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, బ్యాడ్మింటన్ ఆటలాడారు.
Samayam Telugu vijayawada citizen enjoy happy sunday program conducted by vmc
బెజవాడలో ఉత్సాహంగా హ్యాపీసండే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.