యాప్నగరం

బెజవాడ ది బెస్ట్.. దేశంలోని క్లీనెస్ట్ బిగ్ సిటీల్లో ఫస్ట్!

‘స్వచ్ఛ్ సర్వేక్షన్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్లీనెస్ట్ సిటీల సర్వేలో ఇండోర్, భోపాల్‌ నగరాలు వరసగా రెండో ఏడాది కూడా 1, 2 స్థానాలు దక్కించుకున్నాయి.

Samayam Telugu 16 May 2018, 9:58 pm
‘స్వచ్ఛ్ సర్వేక్షన్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్లీనెస్ట్ సిటీల సర్వేలో ఇండోర్, భోపాల్‌ నగరాలు వరసగా రెండో ఏడాది కూడా 1, 2 స్థానాలు దక్కించుకున్నాయి. చండీగడ్ నగరం మూడో స్థానంలో నిలిచింది. కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం రాత్రి సర్వే వివరాలు ప్రకటించారు.
Samayam Telugu va


ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయవాడ స్థానం దక్కించుకుంది. సర్వే రిపోర్టుల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరానికి పది లక్షలకు పైగా జనాభా కలిగిన పెద్ద నగరాల జాబితాలో క్లీనెస్ట్ సిటీగా మొదటి స్థానం లభించింది. అలాగే, మూడు లక్షల నుంచి 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో కర్ణాటకలోని మైసూర్ నగరానికి మొదటి స్థానం లభించింది.

‘స్వచ్ఛ్ సర్వేక్షన్‌’లో భాగంగా ప్రభుత్వం 2017లో దేశంలోని 4,203 మున్సిపాలిటీల్లో సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా 37.66 లక్షల నగరావాసుల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. అయితే, వీటిలో కేవలం 434 మున్సిపాలిటీలు మాత్రమే ప్రమాణాలకు తగినట్లుగా స్వచ్ఛత పాటించి ఈ జాబితాలో స్థానం పొందాయి. ఈ సర్వే పూర్తి జాబితాను ఇంకా విడుదల చేయాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.