యాప్నగరం

బీజేపీ పొత్తుతో తీవ్రంగా నష్టపోయాను: టీడీపీ ఎంపీ

భారతీయ జనతా పార్టీ సహకరించకపోవడం వల్ల తన మెజార్టీ తగ్గిపోయిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ వ్యాఖ్యానించాడు. ఈ రోజు జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించాడు.

TNN 21 May 2017, 2:01 pm
బీజేపీతో పొత్తు వల్ల విజయవాడలో తీవ్రంగా నష్టపోయానని టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అర్బన్ కమిటీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న కేశినేని పై వ్యాఖ్యలు చేశారు. అర్బన్ కమిటీ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీతో పొత్తు వల్ల విజయవాడ వెస్ట్‌లో తనకు 50 వేల ఓట్లు రాలేదని అన్నారు. ఇక్కడ బీజేపీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడిందని, లేకపోతే తనకు లక్షా 30 వేల మెజారిటీ రావాల్సిందని నాని పేర్కొన్నారు. తాను కేవలం 70 వేల ఓట్ల మెజారిటీతో గెలవడానికి కారణం బీజేపీయేనని ఆయన ఆరోపించారు.
Samayam Telugu vijayawada mp kesineni nani comments against bjp
బీజేపీ పొత్తుతో తీవ్రంగా నష్టపోయాను: టీడీపీ ఎంపీ


వచ్చే ఎన్నికల్లో తాను 3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని నాని అన్నారు. తనకు బుద్ధావెంకన్న, బొండా ఉమ, గద్దె రామ్మోహన్ సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీపై కేశినేని వ్యాఖ్యలు ఏపీ రాజకీయల్లో కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రధానిని కలిసిన అనంతరం బీజేపీ, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆరెండు పార్టీల మధ్య పొత్తు విచ్చన్నమవుతున్నట్లు సంకేతాలు వెలువడతున్నాయి. దీనికి అనుగుణంగా టీడీపీ, బీజేపీలు పరస్పర ఆరోపణలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కేశినేని వ్యక్తిగతమైనవా లేక పార్టీ అధిష్ఠానం అదేశాలతోనే చేశారనేది త్వరలోనే బయటపడుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.