యాప్నగరం

వీళ్ల ఆచూకీ చెబితే రూ. 25వేల రివార్డ్!

విజయవాడలోని ఏటీఎంలలో హైటెక్ చోరీలకు పాల్పడిన దుండగుల ఆచూకీ తెలిపిన వారికి రూ. 25వేల రివార్డును అందజేయనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రకటించారు.

TNN 8 Aug 2017, 12:12 pm
విజయవాడలోని ఏటీఎంలలో హైటెక్ చోరీలకు పాల్పడిన దుండగుల ఆచూకీ తెలిపిన వారికి రూ. 25వేల రివార్డును అందజేయనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రకటించారు. ఇప్పటికే నిందుతుల సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేసిన పోలీసులు తాజాగా రివార్డును ప్రకటించారు. గత నెల విజయవాడలోని భవానీపురం క్రాంబే రోడ్డులోని సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలను తెరచి లక్ష రూపాయలు ఎత్తుకుపోయారు. తమ వద్ద ఉన్న తాళంతో ఏటీఎం యంత్రాలను తెరచి డబ్బులు కాజేశారు. సెంట్రల్ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.72 వేలు, ఐవోబీ ఏటీఎం నుంచి రూ.28 వేలు బయటకు తీశారు.
Samayam Telugu vijayawada police announced rs 25 thousand reward for information on atm offenders in bhavanipuram
వీళ్ల ఆచూకీ చెబితే రూ. 25వేల రివార్డ్!


తమ వద్ద ఏటీఎం కార్డులతో డబ్బులు డ్రాచేసిన ప్రతిసారి ఆఖరి నిమిషంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల దొంగలు వాడిన కార్డు వివరాలు ఏటీఎంలలో రికార్డు కాలేదు. దీంతో ఏటీఎం టెక్నాలజీ గురించి బాగా తెలిసినవారే దీనికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. కానీ నిందితుల ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. దీంతో ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు.. వాటిని విజయవాడ సిటీ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో పెట్టారు.

ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించినట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ ప్రజలను కోరారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ. 25వేల నజరానా ఇస్తామని చెప్పారు. వివరాలను తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
#Reward Offered For Information On @AtmOffenders #bhavanipuram-@VjaCityPolice @APPOLICE100 @MyVijayawada pic.twitter.com/vxpNSR4MPq — VijayawadaCityPolice (@VjaCityPolice) August 5, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.