యాప్నగరం

ఆంధ్రా ఊటీలో చలిపులి ప్రతాపం..

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.

TNN 20 Oct 2016, 1:10 pm
విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు అమాతంగా పడిపోయాయి. ప్రస్తుతం 11 నుంచి 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. లంబరసింగిలో 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. చింతపల్లిలో 14, మినుములూరులో 15 డిగ్రీలు, పాడేరు అత్యధికంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి పూట ఉష్ణోగ్రతలే ఇంత తక్కవ స్థాయిలో నమోదవుతుంటే ..ఇక రాత్రిపూట పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంది కదూ. పగటి పూట ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో మైనస్ డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదౌతుంది. 'ఆంధ్రా ఊటీ' అరకులో చలిపులి తీవ్ర స్థాయిలో ప్రతాపం చూపుతోంది. దీంతో స్థానిక జనాలు ఇళ్లలోంచి బయటికి రావడానికే ఇబ్బందులు తీశారు.. మిట్ట మధ్యాహ్నమే చలిమంటలు వేసుకొని కూర్చు పరిస్తితి నెలకొంది.
Samayam Telugu visakha agency temperature is highly down fall
ఆంధ్రా ఊటీలో చలిపులి ప్రతాపం..


తెలంగాణలో సీన్ రివర్స్ ...
సాధారణంగా విశాఖ ఏజెన్సీతోపాటు తెలంగాణ ఏజెన్సీలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాలి. కానీ దీనికి భిన్నంగా ఏపీలో చలి వణికిస్తుండగా, తెలంగాణలో వేడి కాకపుట్టిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.