యాప్నగరం

రాత్రికి రాత్రే విశ్వనగరాలు కావు: కేటీఆర్

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకనుగుణంగా కృషి చేస్తున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం (నవంబర్ 14) శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

TNN 14 Nov 2017, 1:13 pm
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకనుగుణంగా కృషి చేస్తున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం (నవంబర్ 14) శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రికి రాత్రే విశ్వనగరాలు తయారు కావని స్పష్టం చేశారు. నగరంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించామని కేటీఆర్ చెప్పారు. జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ మీద భారం పడకుండా లక్ష ఇండ్లు కట్టబోతున్నామని, వాటి కోసం రూ. 8,650 కోట్లు కేటాయించామని చెప్పారు.
Samayam Telugu visvanagaram cant made overnight k t rama rao
రాత్రికి రాత్రే విశ్వనగరాలు కావు: కేటీఆర్


హైదరాబాద్ నగరంలో మంచి నీటి కొరత లేకుండా చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. మంచినీటి సరఫరా విషయంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మెట్రో వాటర్ బోర్డు పనుల్లో జాప్యం లేదని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ఏడాది కాలంగా రూ. 1000 కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.