యాప్నగరం

వీడియో: భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం

భద్రాద్రి వంతెన వద్ద గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద హై అలర్ట్ విధించారు.

Samayam Telugu 21 Aug 2018, 7:54 pm
ఖమ్మంలో భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం క్రమంగా పెరుగుతూ.. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మంగళవారం (ఆగస్టు 22) సాయంత్రానికి భద్రాద్రి వంతెన వద్ద గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరుకోనుంది. ఇదే జరిగితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. భద్రాచలం వద్ద హై అలర్ట్ విధించారు. తాలిపేరు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో.. 25 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు.
Samayam Telugu Godari


మంగళవారం రాత్రికి గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాల్వంచ డీఎస్పీ వి శ్రీనివాసులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరస్థితిని సమీక్షించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అటు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అఖండ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కృష్ణా జిల్లాలో లంక గ్రామాలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.