యాప్నగరం

వీడియో: చార్మినార్ వద్ద ముస్లింల శాంతి ర్యాలీ.. ఆకర్షణగా జాతీయ జెండా

మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ వద్ద ర్యాలీ అలరించింది.

Samayam Telugu 21 Nov 2018, 11:42 pm
హమ్మద్ ప్రవక్త జన్మదినమైన ‘మిలాద్-ఉన్-నబీ’ని జంట నగరాలకు చెందిన ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బుధవారం (నవంబర్ 21) నగరంలోని పలు చోట్ల ర్యాలీ నిర్వహించారు. పాతబస్తీలోని చార్మినార్ వద్ద నిర్వహించిన శాంతి ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ర్యాలీలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాంతికి పిలుపునిచ్చే జెండాలు చేతబట్టి బైకులపై యువకులు ర్యాలీ చేపట్టారు. పలుచోట్ల జాతీయ జెండాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Samayam Telugu rally


ప్రవక్త జన్మదినం సందర్భంగా నగరంలోని పలుచోట్ల ముస్లింలు పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వీటికి విశేష స్పందన లభించింది. అనంతరం ప్రవక్త బోధనలు వినిపించారు. ర్యాలీలు, నినాదాలతో యువకులు హోరెత్తించారు.


ఇస్లాం క్యాలెండర్ ప్రకారం.. మూడో నెల రబీ-అల్-అవ్వల్‌లో పౌర్ణమి ముందు రోజు మహమ్మద్ ప్రవక్త జన్మించినట్టు ముస్లి సోదరులు భావిస్తారు. అనంత కరుణామయుడైన అల్లాహ్.. సర్వమానవాళి శ్రేయస్సు, శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నకున్నట్టు పవిత్ర ఖురాన్‌ షరీఫ్‌‌లో పేర్కొన్నారు. విశ్వ ప్రవక్త మహమ్మద్‌ కేవలం ముస్లింల కోసం కాదని, సర్వ కోటి జీవరాశులకు ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్‌ నియమించారని అందులో తెలిపారు.

ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని ప్రతి ముస్లిం ప్రార్థిస్తాడు. ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా రాత్రిళ్లు ఆధ్యాత్మిక సభలు, నాతియాకలామ్‌ (ప్రవక్త కీర్తనలు) నిర్వహిస్తారు. వేకువ జామున నమాజ్‌ తర్వాత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముస్లింలతో పాటు పలుచోట్ల హిందువులు కూడా ఎంతో పవిత్రంగా అన్నదానాలు నిర్వహించడం గమనార్హం. ఇది మత సామరస్యానికి అద్దం పడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.