యాప్నగరం

అమిత్ షా కాదు.. తెలంగాణే నాకు బాద్‌షా

తెలంగాణను కించపరిచే వారెవరైనా తమకు శత్రువులేనని సీఎం కేసీఆర్ అన్నారు. అమిత్ షా తెలంగాణపై విషం

Samayam Telugu 24 May 2017, 6:31 pm
తెలంగాణను కించపరిచే వారెవరైనా తమకు శత్రువులేనని సీఎం కేసీఆర్ అన్నారు. అమిత్ షా తెలంగాణపై విషం కక్కుతున్నారని ఆయన విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఒక్క సీటు గెలవడం లేదని తమ సర్వేలో తేలిందని కేసీఆర్ తెలిపారు. రాజ్యాంగ విధానాలకు లోబడి తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సత్సంబంధాలు కొనసాగిస్తానని, అయితే అమిత్ షా తెలంగాణ ప్రజలను కెలికారని మండిపడ్డారు. తనకు అమిత్ షా కాదు.. తెలంగాణ ప్రజలు బాద్ షా అని స్పష్టం చేశారు.
Samayam Telugu we did not take any decision on presidential candidate kcr
అమిత్ షా కాదు.. తెలంగాణే నాకు బాద్‌షా


బుధవారం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఈ నెల 27 న పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. కేసీఆర్ స్పష్టం చేశారు.

‘తెలంగాణను ప్రపంచంలో ఎవరు కించపరిచినా సహించను. కేసీఆర్ తెలంగాణలో సీఎంగా ఉన్నన్ని రోజులు ఎవరు ఏమీ చేయలేరు. ముస్లిం రిజర్వేషన్ల సాధనకోసం కేంద్రంతో పోరాడతాం. మొన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని బీజేపీ టిఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? 2019 ఎన్నికల్లో ఉన్న సీట్లు కూడా రావు. మా మూడేళ్ల పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తా. 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు’ అని కేసీఆర్ విమర్శించారు.

2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ నేషనల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అని చమత్కరించారు.

గ్రామ రైతుల సమన్వయ సమితిలు, మండల, జిల్లా రైతు సమాఖ్యలకు రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పడుతుంది. క్రాప్ కాలనీల ద్వారా ప్రతి రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర దక్కుతుంది. ఎవరికీ నష్టం ఉండదు. డిమాండ్ ను బట్టి పంట పండిస్తారు. ధాన్యానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని కేసీఆర్ చెప్పారు.

తన ఆరోగ్యంపై గత మూడేళ్లుగా అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకుంటున్నట్లు కొంతమంది సన్నాసులు వాగుతున్నారని.. మండిపడ్డ కేసీఆర్ ‘గంట సేపటి నుంచి మీ ముందు ఆరోగ్యంతో ఉండి మాట్లాడుతున్నా..ఇక నా ఆరోగ్యంపై మీరే చెప్పండి’ అంటూ మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు.

సహనానికి కూడా హద్దులుంటాయని కేసీఆర్ హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.