యాప్నగరం

అందుకే కేంద్రంతో రాజీపడ్డా: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకున్నా.. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వసతులను కల్పిస్తామని

Samayam Telugu 27 May 2017, 2:23 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకున్నా.. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చినందుకే కేంద్రంతో ప్రత్యేక ప్యాకేజీతో రాజీపడ్డానని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో జరుగుతున్న పార్టీ మహానాడులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అడుగుజాడల్లో నడుస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేస్తానని పేర్కొన్నారు.
Samayam Telugu we follow ntr footsteps says chandrababu at mahanadu
అందుకే కేంద్రంతో రాజీపడ్డా: చంద్రబాబు


రాష్ట్రాభివృద్ధి కోసమే 14 రోజులపాటు అమెరికాలో కాలినడకన తిరిగానని చెప్పిన చంద్రబాబు... యువతకు ఉపాధి కల్పనకు అనేక పెట్టుబడులు సాధించానని గుర్తు చేశారు. పంచాయతీ రాజ్, సాగునీరు, ఆరోగ్యం, ఇతర విభాగాల్లో రాష్ట్రానికి దేశస్థాయిలో పురస్కారాలు దక్కాయన్నారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందని.. ఇంకా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతన్నలు ఒక్కపైసా ఆశించకుండా రూ.40వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించారని కొనియాడారు. రైతన్నలకు భారీస్థాయిలో రుణాలు మాఫీ చేశామన్నారు. పంట బీమా కల్పించడంతో పాటు గిట్టుబాటు ధర అందిస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు రూ.10వేలు ఇస్తున్నామన్నారు. ‘వెనుకబడి వారిని ఆదుకునేందుకు పింఛన్లు ఇస్తున్నాం. కాంగ్రెస్ హయంలో దెయ్యాలు పింఛన్లు పొందేవి. ఇప్పుడు బతికున్నవారే అందుకుంటున్నారు’ అని బాబు ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.